YSR KADAPA

జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రారంభం.

జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రారంభం.

ఎర్రగుంట్ల ఫిబ్రవరి 11 (పల్లె వెలుగు) : జనసైనికుల శ్రేయస్సు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించారు. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో ఎర్రగుంట్ల జనసేన పార్టీ కార్యాలయంలో  గురువారం సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభమైనది. ఎర్రగుంట్ల మండల జనసేన నాయకులు జగదీష్ ప్రారంభించి  ఈ కార్యక్రమం మొదటి సభ్యత్వం నమోదు జనసేన అభిమానులతో చేయించారు. ఈ సందర్బంగా జగదీష్  మాట్లాడుతూ జనసేన పార్టీకోసం అహర్నిశలు కష్టపడుతున్న కార్యకర్తలకు భరోసాగా, ప్రమాద భీమా కల్పించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా క్రియాశీల సభ్యత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సభ్యత్వం తీసుకున్న జనసైనికులకు 5లక్షలు రూపాయల భీమా, పదివేల నుండి యాభై వేల రూపాయల వరకూ తక్షణ ప్రమాద సహాయం ఉంటుంది అని తెలిపారు. దేశంలో ఏ పార్టీ చెయ్యలేనటువంటి ఇంత గొప్ప భీమా సౌకర్యం కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని, జనసేన అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. అలాగే నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాల జనసైనికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, క్రియాశీల సభ్యత్వం వాలంటీర్లు అందరూ పాల్గొన్నారు.

Nasib Basha

Nasib Basha, yerraguntla, Reporter, YSR Kadapa Dist,
Back to top button