
జడ్జిగా ఎంపికైన ధర్మవరం న్యాయవాది ఉమర్ ఫారూఖ్
జడ్జిగా ఎంపికైన ధర్మవరం న్యాయవాది ఉమర్ ఫారూఖ్
ధర్మవరం (పల్లె వెలుగు) సెప్టెంబర్ 22: పట్టణంలోని దర్గా వీధికి చెందిన మహబూబ్బాషా, అష్రపున్నిసా ల కుమారుడు ఏ. ఉమర్ ఫారూఖ్ జడ్జిగా ఎంపిక కావడం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి ఉమర్ ఫారూఖ్ చిన్న తనం నుంచే చదువు పట్ల అధికంగా మక్కువ చూపేవారని, పదవ తరగతి బిఎస్సార్ బాలుర ఉన్నత పాఠశాలలో మంచి ప్రతి బ ను కూడా కనపరచారని, ఇంటర్మీడియట్ను ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చదవడం జరిగింది. అనంతరం డిగ్రీ తోపాటు పీజీ, ఎల్ఎల్బీని ఎస్కే యూనివర్సిటీలో పూర్తి చేశారు. తదుపరి ధర్మవరం కోర్టులో నూరుల్లా,దస్తగిరి న్యాయవాదుల వద్ద సహాయక న్యాయవాదిగా ఉంటూ మంచి గుర్తింపును పొందారు.2021 లో జనవరి నోటిఫికేషన్ ప్రకటించడం జరిగింది. తదుపరి జనవరిలో పరీక్షలు రాయడం, మార్చిలో ఇంటర్వ్యూలో పాల్గొనడం తర్వాత, సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం హైకోర్టు జడ్జిల ఎంపిక జాబితాను ప్రకటించడం జరిగింది. ఈ జాబితాలో ధర్మారం వాసికి చెందిన ఉమర్ ఫారూఖ్ జడ్జిగా ఎంపిక కావడం పట్ల బార్ అసోసియేషన్, న్యాయవాద గురువులు నూరుల్లా, దస్తగిరి తోపాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కలసి ఉమర్ పారూక్ ను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.