
జగన్ పోవాలి చంద్రబాబు రావాలి
- జగన్ పోవాలి చంద్రబాబు రావాలి
- 3వ వార్డు వైసీపీ నాయకులు టిడిపిలో చేరిక టిడిపిలోకి చేరిన
- వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి
- కోసిగి టౌన్ టిడిపి అధ్యక్షులు చింతలగెని నర్సారెడ్డి
కోసిగి (పల్లెవెలుగు) 11 సెప్టెంబర్: జగన్ దిగిపోయి చంద్రబాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని మంత్రాలయం నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో టిడిపి జెండా ఎగరడం ఖాయమని కోసిగి టౌన్ టిడిపి అధ్యక్షులు చింతలగిరి నర్సారెడ్డి అన్నారు. ఆదివారం కోసిగి నుండి చింతలగెని నర్సారెడ్డి ఆధ్వర్యంలో 50 బైకులలో వంద మందికి పైగా మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ తిక్కారెడ్డిని మరియు రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డిని కలిసి వారికి భారీ గజమాలతో సన్మానించారు. కోసిగిలోని మూడో వార్డుకు చెందిన వైసిపి నాయకులు నల్లన్న, మారయ్య ,వీరేష్, సంజీవరాయుడు, ఏసోబు, కృష్ణంరాజు, నాగరాజు మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ తిక్కారెడ్డి సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్నారు. వైసిపి ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే తాము టిడిపి పార్టీలోకి చేరినట్లు వారు తెలిపారు. మంత్రాలయం నియోజకవర్గం లో టిడిపి జెండా ఎగరవేసి ఎమ్మెల్యేగా తిక్కారెడ్డిని గెలిపించుకుంటామని వారు తెలిపారు. అనంతరం తిక్కారెడ్డి మాట్లాడుతూ కోసిగి అంటేనే టిడిపికి కంచుకోటాని కోసిగి మండలంలో నాటి నుండి నేటి వరకు టిడిపికే ప్రజలు పట్టడం కడుతున్నారని వచ్చే ఎన్నికల్లో నాలుగు మండలాల్లో అత్యధికంగా టిడిపి మెజార్టీతో తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని తిక్కరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సొట్టయ్య,పాలరాజు,అల్లయ్య, కిష్టప్ప బుడ్డన్న ,ఈ రెడ్డి, సంజీవయ్య, వీరస్వామి, వీరేష్, నాగరాజు, పెద్ద ఈరన్న, వెంకన్న, బసవరాజు, హరికృష్ణ, విరుపాక్షి, ఉశేని, తిక్కరెడ్డి వీరితోపాటు టిడిపి నాయకులు కార్యకర్తలు ఉన్నారు.