kosigi

జగనన్న పాలనలో మైనారిటీలకు పెద్ద పీట  కోసిగి మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి

జగనన్న పాలనలో మైనారిటీలకు పెద్ద పీట  కోసిగి మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి

కోసిగి (పల్లెవెలుగు) 19 సెప్టెంబర్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మైనారిటీలకు పెద్ద పీట వేయడం జరిగిందని కోసిగి మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాలమేరకు సోమవారం మండల కేంద్రము కోసిగిలోని మైనారిటీ కాలనీలో సిసి రోడ్లు మరియు త్రాగునీటి పైపులైన్ పనుల నిర్మాణ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా మురళీ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా మురళీరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి మైనారిటీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, కాలనీలో ముళ్ళ కంపలు తొలగించడం జరిగిందని, ఇప్పుడు 4 సిసి రోడ్లు మరియు దాదాపు 1.50లక్షలతో త్రాగునీటి పైపులైన్ పనులను చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. మైనారిటీ నాయకులు ముఖ్యఅతిథి మురళీ రెడ్డిని శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు, యంపీపీ ఈరన్న, మేజర్ గ్రామ సర్పంచ్ కుమారి అయ్యమ్మ, సహాకార సంఘం అధ్యక్షులు మహాంతేష్ స్వామి, నాడిగేని నాగరాజు, మంగమ్మ, రాజేష్, మైనారిటీ నాయకులు కో ఆప్షన్ మెంబర్ సౌఖత్, హాజీ ఉస్మాన్, కటికె ఇస్మాయిల్, షంషుద్దీన్, సోఫి, జాకీర్, యన్ నజీర్, కటికె నజీర్, గోకారి వలీ,హార్లీ ఖాజా ఉసేన్, అహ్మద్, రహీం, జాకీర్, ఖలీల్, గౌస్, సమీర్, లతీఫ్, ఫయాజ్, పారుఖ్, ముల్లా జీలాన్, సుల్తాన్,ఆశాభీ తదితరులు పాల్గొన్నారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button