kosigi

జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి

  • జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి
  • ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాల ద్వారా పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం లో మంజూరైన ఇళ్ళ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు.సోమవారం మండల కేంద్రము కోసిగిలో జగనన్న కాలనీలో గృహ నిర్మాణ శాఖ మరియు వెంకటేశ్వర కన్స్ట్రక్షన్ అద్వరంలో థర్డ్ పార్టీ వారు నిర్మించి ఇస్తున్న ఇళ్ళ భూమి పూజ కార్యక్రమం కు మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిలుగా ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి పాల్గొన్నారు.ఈసందర్బం గా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మాట్లాడుతూ,పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో మంజూరైన ఇళ్ళను కట్టుకోలేని వారు ఒప్పందం మేరకు థర్డ్ పార్టీ అద్వరంలో ఇళ్ళు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని, అందులో భాగంగా జగనన్న కాలనీలో ఇప్పటివరకు 464 లబ్దిదారులు ముందుకు రావడం జరిగిందని,పట్టా ఇచ్చి ఇళ్ళు మంజూరు కానివారు ఉంటే గృహ నిర్మాణ శాఖ అధికారులను సంప్రదించాలని, అలాగే గృహ నిర్మాణంలో నాణ్యత కోల్పోకుండా, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో హౌసింగ్ డీఈ కృష్ణయ్య,ఏఈ షేక్ షావలీ,మేజర్ గ్రామ సర్పంచ్ కుమారి అయ్యమ్మ,యంపీపీ ఈరన్న, మండల సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు, మండల నాయకులు నాడిగేని నాగరాజు,మాణిక్యరాజు, జగదీష్ స్వామి,హోళగుంద కోసిగయ్య,ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం బోర్డు సభ్యులు బుళ్ళి నరసింహులు, కాంట్రాక్ట్ బసిరెడ్డి,పి.నాగేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button