Dewanakonda

జగనన్న ఇంటి నిర్మాణ వ్యయం 1,80,000 నుండి 5 లక్షలకు పెంచాలి.

  • జగనన్న ఇంటి నిర్మాణ వ్యయం 1,80,000 నుండి 5 లక్షలకు పెంచాలి.
  • లబ్ధిదారులతో దేవనకొండ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా..
  • జగనన్న కాలనీల నందు మౌలిక వసతులు కల్పించడం లో ప్రభుత్వం వైఫల్యం..

ఆంధ్ర ప్రతిభ దేవనకొండ జగనన్న కాలనీలలో నిర్మించే ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని 1,80,000 నుండి 5 లక్షలకు పెంచి ఇవ్వాలని,టిడ్కో గృహ  లబ్ధిదారులకు తక్షణమే ఇళ్లను స్వాధీన పరచాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. మద్దిలేటి శెట్టి సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి ఎం. నరసరావు డిమాండ్ చేశారు. సోమవారం దేవనకొండ లో సిపిఐ పట్టణ కార్యదర్శి ఎమ్.నెట్టేకల్ ఆధ్వర్యంలో జగనన్న కాలనీలను సందర్శించి కాలనీలలో జరుగుతున్న పనులను, సమస్యలను లబ్ధిదారులను అడిగి తెలుసుకోని లబ్ధిదారులతో కలిసి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి జగనన్న కాలనీల పేరుతో ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందన్న హామీని తుంగలో తొక్కి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి 180000 ఇవ్వాలని నిర్ణయించిందని అది ఇంటి నిర్మాణానికి ఏమాత్రం సరిపోదని అన్నారు. పట్టణాలకు, పని ప్రాంతాలకు సుదూరంగా కొండలు, గుట్టలు, చెరువులు, ముంపు ప్రాంతాలలో పేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించడంతో ఆయా ప్రాంతాలలో ఇల్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఒక కుటుంబం నివాసముండేందుకు నివాసయోగ్యం కాని విధంగా కేవలం సెంటు స్థలం కేటాయించారన్నారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జగనన్న కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు ఇప్పటివరకు కల్పించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా

Back to top button