
చైర్ పర్సన్ ను వివక్షకు గురి చేసిన మున్సిపల్ కమిషనర్ ను వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేసిన ముస్లిం జేఏసీ
చైర్ పర్సన్ ను వివక్షకు గురి చేసిన మున్సిపల్ కమిషనర్ ను వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేసిన ముస్లిం జేఏసీ
నంద్యాల (పల్లెవేలుగు) 29 అక్టోబర్: నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పై మున్సిపల్ కమీషనర్ వ్యవహరించిన తీరును ముస్లిం జేఏసీ తీవ్రంగా ఖండించింది ఈ సందర్భంగా స్థానిక జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ కన్వీనర్ కె.ఎ ఖాన్ మాట్లాడుతూ ఈ నెల జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పొందు పరచ వలసిన అజెండాల విషయంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ రవి చంద్రరెడ్డి చైర్ పర్సన్ మాబున్నీసా తో ఏకవచనంతో సంభోదించి, ఇష్టానుసారంగా వ్యహరించడం తగదని ఆగ్రహ వ్యక్తం చేశారు అన్ని నీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఒక మహిళపై అదికూడా పట్టణ ప్రధమ పౌరురాలిపై దురుసుగా ప్రవర్తించడంపై తీవ్రంగా మండిపడ్డారు.కౌన్సిల్ సమావేశాల అజెండాను కమిషనర్ చైర్ పర్సన్ కు తెలపాల్సిన భాద్యత ఉంటుందన్నారు ప్రధమ పౌరురాలిపై హుందాగా వ్యవహరించాల్సిన కమిషనర్ చైర్ పర్సన్ పై వీధి రౌడీలా చిందులు వేయడంతో తగదని చైర్ పర్సన్ ను కంటతడి పెట్టించే విధంగా ప్రవర్తించిన కమిషనర్ ను వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అదేక్రమంలో కో కన్వీనర్ గన్ని కరీం మాట్లాడుతూ కమిషనర్ వికృత చేష్టలకు అవాక్కైన చైర్ పర్సన్ మహాబున్నిసా కంటతడి పెట్టుకుంటూ తమ కార్యాలయం నుండి ఇంటికి వెళ్లిపోవడం చూస్తుంటే కమిషనర్ ఎలా వ్యహరించాడో అర్ధం చేసుకోవచ్చని ఈ సంఘటనకు కారణమైన కమీషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి కమీషనర్ చైర్ పర్సన్ భర్త ఏదో అన్నారని అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని గతంలో కూడా దేశం సులోచన చైర్ పర్సన్ గా ఉన్నప్పుడు వారి భర్త కూడా కౌన్సిల్ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం నంద్యాల ప్రజలందరికి తెలుసని మైనారిటీ మహిళలపై మాత్రమే ఎందుకు వివక్ష అని ప్రశ్నించారు. వివక్ష కు గురైన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళపై అధికారులు వివక్షలకు గురి చేయడం ముస్లిం సామాజికాన్ని కించపరచడమే కాబట్టి శాసన సభ సభ్యులు శిల్పా రవి వెంటనే జోక్యం చేసుకుని కమిషనర్ ను విధుల నుండి తొలగించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు మస్తాన్ ఖాన్. అలీమ్. సుహైల్ రానా. హాబీబుల్లా. ముల్లా ఖాజా హుస్సేన్. మహబూబ్ బాష. తదితరులు పాల్గొన్నారు