nandyala

చిరు వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కు వినతి పత్రం

చిరు వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కు వినతి పత్రం

నంద్యాల (పల్లెవెలుగు) 16 నవంబర్: చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఆకుమాల్లా రహీమ్ , అధ్యక్షులు సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో చిరు వ్యాపారుల సంఘం కార్యాలయం నుండి ర్యాలీగా బయలు దేరి నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి కి  చిరు వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణం జిల్లా ఇనందున  ప్రజలు ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతుంది. కావున ప్రజలకు మరియు వాహనదారులకు ఇబ్బంది కల్గించకుండ చిరు వ్యాపారులు వ్యాపారాలు చేసుకోవాలని తెలుపుతూ పుట్ఫాత్ మీద వ్యాపారులు వ్యాపారాలు చేసుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ కి ఫోన్ చేసి చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టకుండా చూడాలని చెప్పడం జరిగింది. చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ నంద్యాల కు కొత్తగా ఏ కమిషనర్ వచ్చిన చిరు వ్యాపారులు పైననే ఇబ్బంది పెట్టడం జరుగుతుందని మేము కూడా చదువుకొని ఉద్యోగాలు రాక చిన్న చిన్న వ్యాపారుల చేసుకొని భార్య పిల్లలను పోషించు కుంటు జీవిస్తున్నాం అని కావున చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టకుండా వ్యాపారాలు చేసుకొనే విధముగా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవ అధ్యక్షులు ఆకూమళ్ళ రహీమ్ మాట్లాడుతూ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి చిరు వ్యాపారుల సమస్యలను విన్న తర్వాత వెంటనే స్పందించి చిరు వ్యాపారులకు న్యాయం చేస్తానని హామీ ఇచినందుకు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణము లోని వివిధ ప్రాంతాలనుండి చిరు వ్యాపారులు అన్వర్, మన్సూర్, సిద్దయ్య, నబీ రసూల్,  నారాయణ, చంద్ర పాల్, సంజీవ రాజు, కలాం, బాలమ్మ,  శివ శంకర్, మాదార్ వలి, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button