
ఘనంగా 74వ గణతంత్ర ఉత్సవ వేడుకలు
ఘనంగా 74వ గణతంత్ర ఉత్సవ వేడుకలు
నంద్యాల (పల్లెవేలుగు) 27 జనవరి: పట్టణంలోని పార్కు రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో జనవరి 26వ తేదీన అనగా గురువారము 74వ గణతంత్ర వేడుకలు మరియు వసంత పంచమి వేడుకలు అక్షరాభ్యాస కార్యక్రమాలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఎం.జీ.వి. రవీంద్రనాథ్ ప్రిన్సిపల్ మాధవీలత దేశనాయకుల చిత్రపటాలకు పూల మాలలను వేసి జాతీయ జెండాను ఎగురవేశారు. గణతంత్ర దినోత్సవం మరియు మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని గురించి పౌరులుగా మన బాధ్యతలను గురించి పిల్లలకు అర్థమయ్యేలా తెలియజేశారు. ఆ తర్వాత చదువులకు ఆదిదేవత, పుస్తక పాణిని, జ్ఞానప్రదాయిని అయిన సరస్వతి తల్లి జన్మదినం కావడంతో దీనిని శ్రీ పంచమి వసంత పంచమి పేర్లతో పిలుస్తారు. ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే అపారమైన జ్ఞానం లభించడమే కాకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యాభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. వేద పండితుల చేత చిన్నారులతో అక్షరాభ్యాస కార్యక్రమం చేయించి అమ్మవారి అష్టోత్తరాలు మరియు పాటలు పాడి చక్కగా పూజలు చేయించడం జరిగినది. సరస్వతీ కటాక్షం అందరికీ లభించాలని కరస్పాండెంట్ ఎం.జీ.వి. రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవవీలత కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.