
kosigi
ఘనంగా సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి వేడుకలు
- ఘనంగా సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి వేడుకలు
- సర్దార్ వల్లభాయి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పిస్తున్న గ్రామ సర్పంచ్ అయ్యమ్మ, నాయకులు
కోసిగి (పల్లెవేలుగు) 31 అక్టోబర్: మండల కేంద్రం కోసిగిలో భారత దేశ ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కుమారి అయ్యమ్మ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు మాణిక్యరాజు, నాడుగేని నాగరాజు, వక్రాని వెంకటేశ్వర్లు, కోసిగయ్యలతో కలిసి ఆమె సర్దార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ సర్దార్ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడన్నారు. స్వాతంత్య్రానంతరం జవహర్లాల్ నెహ్రు నేతృత్వంలో కేంద్ర మంత్రి మండలిలో మొట్టమొదటి హోంశాఖ మంత్రిగానూ, ఉప ప్రధానిగా ఆయన దేశా అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు షంషుద్దీన్, రాజేష్, సచివాలయ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.