Allagadda

ఘనంగా సంక్రాంతి సంబరాలు

ఘనంగా సంక్రాంతి సంబరాలు

ఆళ్లగడ్డ (పల్లెవేలుగు) 16 జనవరి: నియోజకవర్గ దొర్నిపాడు మండల కేంద్రం పరిధిలో గల రామచంద్రాపురం గ్రామంలో కోనసీమను తలపించేలా సంక్రాంతి వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో అంగరంగ వైభవంగా మూడు రోజులుగా జరుగుతున్నాయి. మూడు రోజులపాటు జరుగుతున్న ఈ కార్యక్రమంలో తెప్పోత్సవం, ముగ్గుల పోటీలు, కత్తులు లేని కోడిపందాలు, ఉత్సవ మూర్తుల గ్రామోత్సవాలతో పండుగను ఆనందంగా గ్రామ ప్రజలంతా కలిసి ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకుంటున్నారు. సోమవారం గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఊరంతా సందడిగా సంక్రాంతి అంతా ఆ గ్రామంలోనే ఉందా అన్న చందంగా బంధుమిత్ర సకుటుంబ సపరివారంగా సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు.

sridhar

Sridhar Allagadda, Reporter, Nandyal Dist.
Back to top button