
ఘనంగా మదర్ థెరిస్సా 112 వ జయంతి వేడుకలు
ఘనంగా మదర్ థెరిస్సా 112 వ జయంతి వేడుకలు
విజయవాడ: నేను ఎలా ఉన్నా పర్వాలేదు,నా పిల్లలు బాగుంటే చాలు అని అనుకునేది అమ్మ అయితే,ప్రపంచం లోని ప్రజలు బాగుంటే చాలు,నేను ఏమైనా పర్వాలేదు అని భావించి ప్రపంచ శాంతి కోసం పరితపించిన గొప్ప మానవతా వాది మదర్ థెరిస్సా అని ఎమ్. కే. బేగ్ మునిసిపల్ ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎమ్.ఎస్.ఇమామ్ బాషా అన్నారు. మదర్ థెరిస్సా 112 వ జయంతి వేడుకలను స్కూల్ లో జరిపినట్లు ఇమామ్ బాషా తెలిపారు. టీచర్స్ స్టాఫ్ సెక్రెటరీ డి.పూర్ణ చంద్ర రావు మాట్లాడుతూ ఇతర దేశంలో పుట్టి భారత దేశానికి విచ్చేసి, అనాథలను, వితంతువులను, పేదలను చేర దీసి, వారికి సేవ చేసిన మాతృ మూర్తి మదర్ థెరిస్సా అని,ఆమెకు మన దేశం భారత రత్న అవార్డును బహూకరించినట్లు చెప్పారు. అనంతరం హెచ్.ఎమ్, టీచర్లు, విద్యార్థులు, మదర్ థెరిస్సా కు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టి.సుమలత, ఎమ్.నాగ పావని, కె.శ్రీనివాస రావు, హమీదున్నిసా, పాల్గొన్నారు.