nandyala

ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

నంద్యాల (పల్లెవేలుగు) 11 నవంబర్: భారత తొలి విద్యాశాఖ మంత్రి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని నంద్యాల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి చింతల మోహన్ రావు మరియు రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి మస్తాన్ ఖాన్ ఆధ్వర్యంలో మరియు నంద్యాల  మైనార్టీ నాయకులు జమాఅతె  ఇస్లామీ పట్టణ అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్, అల్మేవ రాష్ట్ర సలహాదారు  సమక్షంలో ఘనంగా నిర్వహించారు. చింతల మోహన్ రావు అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మైనార్టీ జర్నలిస్టులైన విశాలాంధ్ర ఉస్మాన్, ఎం.ఆర్ న్యూస్ ఛానల్ మౌలా హుస్సేన్ ను శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అబ్దుల్ సమద్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర సమరయోధుడిగా ఎనలేని సేవలందించిన మరియు భారత ప్రథమ విద్యాశాఖ మంత్రిగా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అభినందించారు. వాస్తవానికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి కాంగ్రెస్ పూర్తిగా హక్కుదారని, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా సేవలందిస్తూ స్వాతంత్ర  సమర పోరాటంలో ఎన్నో మార్లు జైలుకు వెళ్లి హిందూ ముస్లిం ఐక్యతకు నిరంతరం శ్రమించిన విద్యా ప్రజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, నర నరాల దేశ ఐక్యత లౌకికత్వాన్ని నింపుకున్న ఆజాద్ నిజంగా గొప్ప స్వాతంత్ర యోధులు అన్నారు. విద్యామంత్రిగా ఆయన చేసిన విప్లవాత్మక మార్పులు, స్థాపించిన యూజిసి, ఐఐటి, మేనేజ్మెంట్ విద్యాలయాలు, సంస్థలు నేటికి ప్రపంచానికి ఇండియాలో ఉన్నతంగా నిలిపాయన్నారు. నేడు నూతన విద్యా విధానం పేరా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యా విధానాన్ని తుంగలోకి తొక్కి కాషాయకరణ చేస్తుందని ఆవేదన వ్యక్తపరిచారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ వైపు కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారని ఇది శుభ పరిమాణం అని తెలిపారు. అనంతరం ఆబులైస్ మాట్లాడుతూ ఆజాద్ మక్కాలో జన్మించారని ఆయన బాల్యం లోనే ఎన్నో పత్రికలు నిర్వహించారని అలనాడు ఆయన స్థాపించిన వాటిని విస్మరించి కాంగ్రెస్ ఏం చేసింది అని బిజెపి అడగడం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతల. మోహన్ రావు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆజాద్ గ్రామీణ ప్రాంతానికి కూడా విద్య అందించారని ప్రతి యువకుడు విద్యావంతులైతే దేశం అభివృద్ధి లో నడుస్తుందని భావించి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ నేటి పౌరులు మౌలానా ఆజాద్ ను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మస్తాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ హిందూ ముస్లిం ఐక్యతకు కట్టుబడి ఉందని రాబోయే ఎన్నికలలో తప్పక పూర్వ వైభవం

 సాధిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కార్యకర్తలు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button