
ఘనంగా జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం
ఘనంగా జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం
పాణ్యం (పల్లెవెలుగు) 24 శనివారం: స్థానిక మండలలోని శాంతిరాం ఫార్మసీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ ఫార్మసిస్ట్ డే సందర్భంగా విద్యార్థులకు రంగోళిళ, వ్యాసరచ, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ శెట్టివిచేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో ఔషధాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని అన్నారు, ఔషధం లేకుండా చికిత్స లేదని. ఔషధ సృష్టికర్తలు ఫార్మాసిస్టులే అన్నది మనం గుర్తుంచుకోవాలన్నారు ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ ఎఫ్ఐపి ఔషధ రంగంలో ఫార్మాసిస్టుల పాత్రను ప్రతిబింబిస్తూ సెప్టెంబర్ 25 న ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని నిర్వహిస్తోందని అన్నారు. అనంతరం ఆయన జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రథమ ప్రాధాన్యం విద్యాభ్యాసమని కానీ భావి భారతాన్ని నిర్మాతలైన యువశక్తి ని దేశ పురోభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు జాతీయ సేవా పథకం ప్రారంభమైందని అన్నారు. ఆరోగ్య సూత్రాలను, వయోజన విద్య ఆవశ్యకతను, జనాభా సమస్య నివారణను ప్రజలకు తెలియజేయడం. వరదలు వచ్చినప్పుడు, అగ్ని ప్రమదాలలోనూ సహాయం చేయడం. ధనవంతుల నుండి విరాళాలు సేకరించి బీదవారికి, అనాథలకు సహాయపడటం. పొదుపు ఆవస్యకతను, అంటు వ్యాధుల వల్ల వచ్చే అరిష్టాలను అరికట్టే విధానాలను ప్రచారం చేయడం .ఎన్ ,ఎస్ ,ఎస్, వాలంటీర్ల కర్తవ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలోఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె సంపత్ , పాల్గొన్నారు.అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.