nandyala

ఘనంగా జాతీయ ఉర్దూ దినోత్సవ వేడుకలు

ఘనంగా జాతీయ ఉర్దూ దినోత్సవ వేడుకలు

నంద్యాల (పల్లెవేలుగు) 09 నవంబర్: స్థానిక నంద్యాల పట్టణము ఎస్. వి. డిగ్రీ కాలేజ్ వద్ద గల అల్ మదద్  కొంపుటర్ సెంటర్ నందు అల్లమా మహమ్మద్ ఇక్బాల్ జయంతి సందర్భముగా జాతీయ ఉర్దూ దినోత్సవ వేడుకలు ఘనంగా  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మహాబున్నిసా , ప్రత్యేక అతిథులుగా జమియత్ యే ఉలమా హింద్ నంద్యాల జిల్లా అధ్యక్షులు మౌలానా ఖలీల్ అహమద్ మరియు నంద్యాల ముస్లిమ్ జేఏసీ కన్వీనర్ Ak ఖాన్, చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గుప్తా, వికలాంగుల హక్కుల  సంక్షేమం సంఘం అధ్యక్షుడు మస్తాన్ వలీ హాజరు కావడం జరిగింది. నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్  మహబున్నిస మాట్లాడుతూ జాతీయవాది ఉర్దూ కవి అల్లమా ఇక్బాల్ జయంతి నీ కులమతాలకు అతీతంగా విద్యార్థిని , విద్యార్థుల మధ్య జరుపడం ఆనందం వ్యక్తం చేస్తూ ఇక్బాల్ ఏవిధముగా అయితే దేశభక్తి నీ, జాతీయ సమైక్యత కు నిదర్శనము గా సారే జహాసి హచ్చా హిందూ సితాహమార రచించి దేశభక్తిని పెంపొందించారు. అదేవిధముగా అల్ మదద్ ఫౌండేషన్ విద్యార్థిని, విద్యార్థుల మధ్య ఉర్దూ దినోత్సవ వేడుకలు జరపడం జాతీయ సమైక్యత కు నిదర్శనము అని తెలిపారు.  మౌలానా ఖలీల్ అహమద్ మాట్లాడుతూ అల్లమా ఇక్బాల్ తన రచనలతో కవిత్వాలతో స్వతంత్ర  పోరాటంలో ప్రజలకు  ఉత్సహ పరిచే వారు. భారత దేశ ప్రజలందరూ పూల వనములో పూలవలె అందరూ కలిసి మెలిసి మానవత్వము తో సోదర భావముతో మెలగాలి అని చాటి చెప్పిన గొప్ప తత్వ వేత్త అని తెలిపారు. ఉర్దూ భాష కేవలం ముస్లిమ్ ల భాష కాదని , సర్వమానవ భాష అని తెలిపారు. నంద్యాల ముస్లిమ్ జేఏసీ కన్వీనర్ ఖాన్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి నాయకులు కాబోయే యువ నాయకుల మధ్య ఉర్దూ దినోత్సవ వేడుకలు జరపడం దేశభక్తిని పెంపొందించుకుని దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు అయ్యేవిదముగా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం విద్యార్థుల మధ్య చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం ఉర్దూ భాషాభివృద్ధి లో  అల్లమా ఈక్బాల్ పాత్ర అనే అంశము పై వ్యాస రచన పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థుల కు  అతిథుల చేత బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి నేషనల్ కాలేజీ విద్యార్థిని అర్షియ,రెండవ బహుమతి హరి ప్రసాద్ నాయక్, జూనియర్ కాలేజ్, మూడవ బహుమతి సుదర్శన్, జూనియర్ కాలేజ్ ఈ కార్యక్రమం లో అల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమళ్ళ రహీమ్ ,సభ్యులు రహంతుల్లా, నాబిరసూల్ ,హుస్సేన్, సయ్యద్ మౌలాలి,కంప్యూటర్ ఫ్యాకల్టీ మజీద్, SV డిగ్రీ కాలేజీ ఉపాద్యలు విద్యార్థిని విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button