
ఘనంగా జరిగిన విగ్రహ స్థాపనం
ఘనంగా జరిగిన విగ్రహ స్థాపనం
ధర్మవరం,డిసెంబర్ 03;(పల్లెవెలుగు) పట్టణములోని మార్కెట్ వీధిలో గల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో4వ రోజు శనివారం అర్చకులచే విశ్వకేశాన ఆరాధనము, పుణ్యాహవాచనము, అగ్ని ప్రణయం, కుంభారాదనం విగ్రహ స్థాపనం,మహా శాంతి అభిషేకం, మూర్తి హోమం తదితర కార్యక్రమాలను మంగళ, వాయిద్యాలు, వేదమంత్రాల మధ్య, ఘనంగా శ్రీ పద్మశాలీయ బహుత్తమ సంఘం అధ్యక్షులు జక్కా చిన్న సింగరయ్య, ఉపాధ్యక్షులు జింక రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి జింక చిన్నప్ప, కమిటీ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 25 మంది పురోహితులచే పూజా కార్యక్రమాలను ఘనంగా భక్తాదుల నడుమ నిర్వహించారు. పద్మశాలీల కులదైవంగా పూజింపబడుతూ చేనేత కుటుంబాల కొంగుబంగారమైన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన రుషింద్రుల వారి దేవాలయంలో ఆలయ శిఖర, గర్భాలయ, ముఖ మండప ,రాజా గోపురముతో సర్వాంగ సుందరముగా కమిటీ ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. తదుపరి గ్రామోత్సవము, అగ్ని ప్రణయనం అర్చకులు నిర్వహించరు. ఈ వేడుకలు డిసెంబర్ 4వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని దేవాలయ అధ్యక్షులు తెలిపారు. అనంతరం శ్రీ అన్నమయ్య సేవా మండలి వారి ఆధ్వర్యంలో పొరాల పుల్లయ్య శిష్య బృందం ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తన గానసుధ అందరిని అలరించింది. ఈ కార్యక్రమంలో పద్మశాలియ బహుత్తమ సంఘం ధర్మవరం ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి బోడగల శంకర ,
కోశాధికారి పొరాళ్ల పుల్లయ్య , జింకా నాగభూషణ, గోలి నాగభూషణ, గడ్డం రామకృష్ణ, జింకా మోహన్ బాబు, కట్టా గోవిందు పోలంకి పెద్ద రెడ్డప్ప, జింకా రెడ్డప్ప, కమిటీ సభ్యులు, సహాయ కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులు, ప్రచార కార్యదర్శులు, డైరెక్టర్లు , అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.