
ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు
ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకలు
ధర్మవరం పల్లె వెలుగు పట్టణంలోని చర్చిలలో ఆదివారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని మార్కెట్ వీధిలో గల ఎస్సై యు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఎంపీడీవో కార్యాలయం పక్కన గల షాలేము ప్రార్థనా మందిరంలో ఫాస్టర్ ఏలియాజర్ యేసు రత్నం యొక్క కేకును కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. దుర్గా నగర్ లో గల ఎల్ఈఎఫ్ చర్చిలో పాస్టర్ మేషక ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంఘ పెద్దలతో పాటు కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను తెలియజేశారు. పట్టణంలోని హోలీ లైట్ చర్చిలో ఫాదర్ మల్లెల రమేష్ బాబు ప్రత్యేక ప్రార్థనలు అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను తెలియజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదుపరి ఎర్రగుంట లోని కింగ్ ఆఫ్ కింగ్స్ గాస్ పాల్ చర్చిలో పాస్టర్ గ్రేస్య, సంఘ పెద్దలు కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకున్నారు. రైల్వే క్వార్టర్స్ లో గల ఎస్టీ. ఆండ్రూ స్ క్యాథలిక్ చర్చిలో పాస్టర్ పసల జోసెఫ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తొలుత కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత ఇంటింటికి వెళ్లి ఏసు పుట్టుక గూర్చి తెలియజేశారు. తదుపరి రైల్వే స్టేషన్ లోని యాచకులకు అనాధలకు బెడ్ షీట్లు పంపిణీ చేశారు.