
ఘనంగా జనసేనుని జన్మదిన వేడుకలు
ఘనంగా జనసేనుని జన్మదిన వేడుకలు
మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జన సైనికులు
కోసిగి (పల్లెవెలుగు)02 సెప్టెంబర్: మండల కేంద్రమైనా కోసిగిలోని సినీ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా శ్రీ రేణుక యల్లమ్మ అవ్వ ఆవరణంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముక్య అతిధిగా మంత్రాలయం నియోజకవర్గ జనసేన నాయకులు లక్ష్మన్న పాల్గొన్నారు. అనంతరం మెగా ఫ్యాన్స్ జనసైనికులు అనుమేష్, రామంజి, గణేష్,రాజు, కృష్ణ,వీరేశ్,రమేష్,ఏసేబు, నాగరాజు, చందు,శేఖర్,ఈరన్న,మంజు , బసవరాజు,తదితరులు మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇది పెరు కాదు ఒక ప్రభంజనం ఇండ్రస్ట్రీలో హిట్స్ ప్లాప్ లతో సంబంధం లేకుండా ఎదిగిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు.సినీ ఇండ్రస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎన్నో సేవకార్యక్రమాలు చేస్తూ కోట్ల మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అన్నారు.టాప్ హీరోగా కొనసాగుతున్న టైం లొనే జనసేన పార్టీని స్థాపించి బాలంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తు రాష్ట్ర రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్న ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు.ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజా పార్టీగా జనసేన అవతరించింది అన్నారు, మానవతావాది, జనసైనికుడు, జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ప్రతియేటా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్వార్థం ఎరగేని ప్రజాసేవకుడు పవన్ కళ్యాణ్ అని, ప్రజా సంక్షేమమే ద్యేయంగా. బాధితా కౌలు రైతుల కుటుంబాలకు పార్టీ తరపున రూ. లక్ష చెల్లిస్తూ ఆదుకుంటున్నాడన్నారు. ప్రభుత్వం చేయలేనటువంటి పనులెన్నో తాను చేసి చూపిస్తున్నాడన్నారు. వచ్చే 2024 ఎన్నికల్లో ప్రజల మద్దతుతో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆదోని గోపి చారిటబుల్ బ్లెడ్ సెంటర్ వారిని పులమలతో సన్మానించి కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. తదనంతరం ఆదోని గోపి చారిటబుల్ బ్లెడ్ సెంటర్ వారు మాట్లాడుతూ తక్కువ టైం లో 56 మంది బ్లెడ్ డోనేషన్ చేయడం హర్శించదగ్గ విషయమని ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.