
ఘనంగా కోహ్లీ జన్మదిన వేడుకలు
- ఘనంగా కోహ్లీ జన్మదిన వేడుకలు
- క్రికెటర్ కింగ్ కోహ్లీ జన్మదినం సందర్భంగ ఘనంగా సంబరాలు జరుపుకున్న అభిమానులు.
భారత దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు, ట్రోఫీలను అందించిన కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా కోసిగి లోని అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ముందుగా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో కోహ్లీ పేరు మీదుగా పూజలు జరిపించి, కేక్ కట్ చేసి అభిమానులకు పంచి పెడుతూ, భారతదేశానికి ఎన్నో విజయాలను అందించాలని అభిమానులు కోరారు. 1988 నవంబర్ ఐదున జన్మించిన కోహ్లీ 2006 ఢిల్లీ డొమెస్టిక్ క్రికెట్లో అడుగు పెట్టి అనతి కాలంలోనే, 2008 ఆగస్టు 18న ఇండియా టీంలో చోటు సంపాదించుకున్నాడు. 102 టెస్టులు, 262 వన్డేలు, 113 t20 లు ఇండియా తరఫున ఆడటం జరిగింది. 175 వన్డే లకు కెప్టెన్ గా వ్యవహరించి,వన్డేలో 71 సెంచరీలతో కొనసాగుతున్నాడు. ఒక్క ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో సైతం కింగ్ కోహ్లీకి అభిమానులు ఉన్నారంటే ఆశ్చర్య పోవడం అవసరం లేదు అని భవిష్యత్తులో భారతదేశానికి మరిన్ని విజయావకాశాలు అందించి,ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భారతదేశానికి కచ్చితంగా విజయం చేకూర్చుతారని కృష్ణ, రామాంజి, నవీన్, నర్సారెడ్డి, మంగలి వీరేష్, గేల్ మరియు, క్రికెట్ అభిమానులు, పాల్గొన్నారు