
ఘనంగా కేఈ ప్రభాకర్ పుట్టినరోజు కార్యక్రమం
ఘనంగా కేఈ ప్రభాకర్ పుట్టినరోజు కార్యక్రమం
డోన్ పల్లె వెలుగు : డోన్ పట్టణంలోని మధు ఫంక్షన్ హాల్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ ఫణి రాజు, వైస్ మున్సిపల్ చైర్మన్ కేషన్న, టిడిపి నాయకుడు సుదీష్ రాజ్, ఇతర టిడిపి నాయకుల ఆధ్వర్యంలో కేఈ అభిమానులు, టిడిపి కార్యకర్తల నడుమ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కి చిట్యాల రఘు, అమర్ గౌడ్, సుధీష్ రాజ్ లు గజమాలతో ఆహ్వానం పలికి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కె.ఈ.ప్రభాకర్ మాట్లాడుతూ రాజకీయంగా ఎదుగుదల అనేది అంచలంచలుగా ఉంటేనే వాటి బరువు బాధ్యతలు తెలుస్తాయని ఎటువంటి పదవులు చేయకుండా ఎమ్మెల్యే పదవిని అధిరోహించాలనుకోవడం అత్యాశకు నిదర్శనమని చురకలు అంటించారు. డోన్, పత్తికొండ నియోజకవర్గ ప్రజల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజల అండదండలు ఎల్లవేళలా కేఈ కుటుంబం పై చూపిస్తూనే ఉండాలని 2024 ఎన్నికలలో తప్పక డోన్, పత్తికొండ నియోజకవర్గంలలో కుటుంబం నుంచే పోటీ చేస్తారని తెలిపారు.