west godavari

ఘనంగా ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్  సర్వ సభ్య సమావేశం

ఘనంగా ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్  సర్వ సభ్య సమావేశం

నర్సాపురం (ఆంధ్రప్రతిభ) 23 ఆగస్ట్: స్థానిక పట్టణం లోని అంజుమన్ షాదిఖన నందు మంగళవారం అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. నర్సాపురం ఖజి ఎం.డి. ఇమ్రాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ జాతీయ కార్యదర్శి హాజరత్ షా ఖాద్రి సయ్యద్ ముస్తఫా రఫాయి జిలాని , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా అబ్దుల్ ఖదీర్ నిజామి, రాష్ట్ర యూత్ కార్యదర్శి సోహైల్, రాష్ట్ర మీడియా కార్యదర్శి జావిద్, అమానుల్లా  పాల్గొన్నారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ మనం అందరం ఐక్యతతో ఉండాలని , ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ముస్లిమ్స్ అడ్వకేట్ అసోసియేషన్ వంటి జాతీయ సంఘాలతో కలిసి పనిచేస్తుందని తెలిపారు. రాష్ట్ర యూత్ కార్యదర్శి సోహైల్ మాట్లాడుతూ నర్సాపూర్ మొదటిసారి రావడం జరిగిందని ప్రకృతి రీత్యా ఈ ఊరు తనకు ఎంతో ఆకర్షించిందన్నారు. ప్రకృతి లాగానే ప్రజలు కూడా స్నేహ భావాలతో అందరూ కలిసి ఉండాలని అలాగే చురుకుగా సేవ కార్యక్రమాలు చేయాలని అల్ ఇండియా మిల్లి కౌన్సిల్ మీకు తోడుగా ఉంటుందని.. అలాగే హాజరత్ జి, ఉలేమా , మౌలానా ల దువా ఉంటుంది అన్నారు. అనంతరం హాజరత్ షా ఖాద్రి సయ్యద్ ముస్తఫా రఫాయి జిలాని దువా తో ఈ కార్యక్రమాన్ని ముగిసించారు. ఈ కార్యక్రమం లో నర్సాపూర్ వివిధ సంఘ నాయకులు, ఉలేమలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button