
nandyala
ఘటనను తీవ్రంగా ఖండిచిన అల్ మేవ
ఘటనను తీవ్రంగా ఖండిచిన అల్ మేవ
నంద్యాల (పల్లెవేలుగు) 14 ఫెబ్రవరి: గుర్తు తెలియని సంఘ విద్రోహ శక్తులు, నంద్యాల బొమ్మల సత్రం లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర పన్ని, అంబేద్కర్ విగ్రహం చేతి వేలును, ముక్కు పైన, కంటి పైన రాళ్లతో దాడి చేసి, తలపై రాళ్లను పెట్టి కాళ్ల వద్ద పేపర్లతో మంట పెట్టారు, విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, సంఘ విద్రోహ శక్తులను పట్టుకొని, చట్టపరంగా శిక్షించాలని ఆల్ మేవా నంద్యాల జిల్లా వారు డిమాండ్ చేశారు అల్మేవ గౌరవాధ్యక్షులు S.Md.అబులైస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇమ్రాన్ పా,షా ముహమ్మద్ సలీం లు ఖండించారు.