kosigi

గ్రామ అభివృద్ధికి కృషి చేద్దాం – సర్పంచ్ అయ్యమ్మ వెల్లడి

గ్రామ అభివృద్ధికి కృషి చేద్దాం – సర్పంచ్ అయ్యమ్మ వెల్లడి

కోసిగి గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేద్దామని మేజర్ గ్రామ సర్పంచ్ కుమారి  అయ్యమ్మ అన్నారు.శనివారం కోసిగి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ వార్డు సభ్యుల తో  అయ్యమ్మ అధ్యక్షతన ఇన్చార్జి సెక్రెటరీ ఆరోన్ రషీద్  ఖాన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్అయ్యమ్మ మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యలను సమిష్టిగా  పరిష్కరించుకుందాం అని సర్పంచ్ అయ్యమ్మ ఉన్నారు.గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని తాగునీటిని వేడి చేసుకొని వడపోసుకొని తాగాలి అన్నారు. అలాగే  మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ,మండల ఇన్చార్జి మురళీ మోహన్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అయ్యమ్మ తెలియజేసింది.ఈ కార్యక్రమంలోవైఎస్సార్సీపీ మండల నాయకులు మాణిక రాజు, పంచాయతీ సిబ్బంది వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button