
గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తాం – ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తాం – ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
ధర్మవరం (పల్లె వెలుగు) అక్టోబర్ 10: గ్రామాల్లో సమస్యలను పరిష్కరించడానికి గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం మండల పరిధిలోని తనకంట వారి పల్లి బుడ్డారెడ్డిపల్లి గ్రామాలలో వారు గుడ్ మార్నింగ్(గడపగడపకు) కార్యక్రమాన్ని. ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరించే దిశగా అధికారుల సమక్షంలో కొన్నింటిని పరిష్కరించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల మతాలకు, పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను తెలియజేయడానికి తమ ఇంటి వద్దకే వాలంటీర్లు వస్తున్నారని, మీ సమస్యలు ఏమైనా ఉన్న యెడల వాలంటీర్ ద్వారా సచివాలయంలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా? లేదా? అన్న విషయంపై నేరుగా ప్రజల వద్ద అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతోందన్నారు. గ్రామ ప్రజలు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సచివాలయ ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు. త్వరలో జరగనున్న భూ పంపిణీ కార్యక్రమంలో అర్హత ఉండి సాగులో ఉన్నవారికి పట్టాలను పంపిణీ చేస్తామని తెలిపారు. తదుపరి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇంటి పట్టాలు తదితర ఫిర్యాదులను స్వీకరించి, వెంటనే సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని అప్పటికప్పుడే అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఎఫ్ఎసి తహసిల్దార్ యు గేశ్వరి దేవి, ఇంచార్జ్ఎంపీడీవో మమతా దేవి, జడ్పీ వైస్ చైర్మన్ కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ అధికారి చెన్న వీరస్వామి, ఏపీవో అనిల్ కుమార్ రెడ్డి, ఆయా గ్రామాల వైఎస్ఆర్సిపి నాయకులు, సచివాలయ, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.