panyam

గ్రామానికిచ్చిన హామీలు మాయం

గ్రామానికిచ్చిన హామీలు మాయం

  • మాట్లాడుతున్న గ్రామ ప్రజలు రమణారెడ్డి

పాణ్యం,పల్లెవెలుగు సెప్టెంబరు 18,09,2022, స్థానిక మండలంలోని తోగర్చిడు ఎన్నికల్లో ఏకగ్రీంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి రూ.10ల క్షలు ఇస్తానన్న హామీలెక్కడ అంటూ సర్పంచు గ్రామ ప్రజలు, టీడీపీ నాయకులు ప్రశ్నించారు. మండలంలోని తొర్చేడులో ఆదివారం గ్రామ ప్రజలు గ్రామ సభ ఏర్పాటు చేశారు. వైసీపీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డిని గ్రామప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల సమయంలో తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృ ద్ధికి రూ.10 లక్షలు ఇస్తానని, తెలుగుదేశం రూ.ఐదు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి నట్లు గ్రామప్రజలు పేర్కొన్నారు. పలుమార్లు అభివృద్ధి నిధులపై సమావేశం నిర్వ హించాలని సర్పంచు కోరగా దాటవేస్తున్నారని ఆదివారం గ్రామసభ ఏర్పాటు చేయాలని సర్పంచ్ చెప్పడంతో గ్రామ ప్రజలు గ్రామసభకు వచ్చినా సర్పంచ్ రాకపో వడంపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు టీడీపీ నాయ కులు రూ.5 లక్షలు గ్రామసభకు తెచ్చి ప్రజల సమక్షంలో ఇవ్వడంతో సర్పంచ్ ఇవ్వ నున్న రూ.10 లక్షలు ఇవ్వాలని పట్టుపట్టారు. తనకు అత్యవసర పని ఉందని గ్రామ సభకు రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని పలు సమస్యలు అలాగే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వక పోగా నీరుగారుస్తోందని పేర్కొన్నారు. సర్పంచ్, టీడీపీ నాయకులు ఇచ్చిన హామీ మేరకు గ్రామ అభివృద్ధి నిధులు ఇస్తే సమస్యలు పరిష్కారమవుతాయని టీడీపీ నాయకుడు రమణారెడ్డి పేర్కొన్నారు.

Back to top button