
గొట్లూరు అనాధాశ్రమంలో అన్నదానం,వస్త్ర దానం
గొట్లూరు అనాధాశ్రమంలో అన్నదానం,వస్త్ర దానం
ధర్మవరం (పల్లె వెలుగు) ధర్మవరం మండల పరిధిలోని గొట్లూరు గ్రామములోని విశ్వశాంతి అనాధా శ్రమంలో మంగళవారం ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు, లలిత, అనంతపురం మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.శైలజ, డి. వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, కడప కె.ఎస్.ఆర్.ఎం. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు, పూర్వ ఇంజనీరింగ్ విద్యార్థుల బ్యాచ్, 1984-88 విద్యార్థుల కమిటీ ఆధ్వర్యంలో అనాధా శ్రమంలో తొలుత దీపావళి పర్వదినాన్ని జరుపుకున్నారు. తదుపరి ఆశ్రమంలోని వారందరికీ కూడా అన్నదానముతో పాటు వస్త్రధానము కూడా పంపిణీ చేశారు. తదుపరి వృద్ధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి పండుగను అనాధా శ్రమంలో జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామని వారు తెలిపారు. తదుపరి ఆశ్రమ నిర్వాహకులు ప్రపుల్లా చంద్ర వారందరికీ కృతజ్ఞతలను తెలియజేశారు.