Yemmiganur

గురుకుల బాలికల విద్యాలయ ప్రాంగణంలో నూతన భవన సముదాయంను. ప్రారంభించిన.. ఎమ్మెల్యే.

గురుకుల బాలికల విద్యాలయ ప్రాంగణంలో నూతన భవన సముదాయంను. ప్రారంభించిన.. ఎమ్మెల్యే.

కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు మండల పరిధిలో గల బనవాసి ఫారం గురుకుల బాలికల విద్యాలయ ప్రాంగణంలో నాడు-నేడు లో భాగంగా నిర్మించిన నూతన భవన సముదాయం గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ సాజిదాబేగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమమునకు శుక్రవారం రోజున ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కె.చెన్నకేశవరెడ్డి హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద పిల్లలు సైతం ఉన్నతస్థాయి వర్గాల పిల్లలు చదివే చదువు అందించాలనే ఉద్దేశ్యంతో మనబడి నాడు-నేడు పథకం తెచ్చి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అందంగా తీర్చిదిద్దారని,అందుకు అనుగుణంగానే అనుభవజ్ఞులైన ఉపాద్యాయులు ఉండి, విద్యార్థులకు కావల్సిన అన్ని సౌకర్యాలువ సతులు కల్పించారని,ఇటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దొరకడం ఆంధ్రప్రదేశ్ అదృష్టం అని తెలిపారు. కనుక విద్యార్థులుగా మీరు కష్టపడి,ఇష్టపడి చదివి, మంచి మార్కులు సాధించి ఉన్నతశిఖరాలను అందుకోవాలని సూచించారు. ఒకప్పుడు ఈ గురుకుల విద్యాలయం గాజులదిన్నె ప్రాజెక్టు దగ్గర కొట్టాలలో ఉండేవని, అప్పటి ఎమ్మెల్యే బీవీ.మోహన్ రెడ్డి పట్టుబట్టి బనవాసి ఫారంలో ఏర్పాటు చేశారని అన్నారు. అనంతరం కీ,శే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో తరగతి గదులకు శంకుస్థాపన చేసి,ఈ పాఠశాలకు కావల్సిన వసతులు కల్పించారని, అనంతరం ముఖ్యమంత్రి గా కోట్ల విజయభాస్కరెడ్డి ప్రారంభోత్సవం చేశారని తెలిపారు.

K.Yallayya

K. Yallayya Reporter, Yemmiganuru,
Back to top button