Dharmavaram

గిరిజన హక్కుల కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధం

  • గిరిజన హక్కుల కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధం
  • జివిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డుంగావత్ బాలాజీ నాయక్ హెచ్చరిక

 

ధర్మవరం (పల్లెవెలుగు) 28 నవంబర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాల్మీకి బోయలను గిరిజన జాబితాలో చేరుస్తామంటూ ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 52ను మరియు ఏకసభ్య కమిషన్ ను వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో ఈనెల 28 ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని గిరిజన జేఏసీ సంఘాల నాయకులు హెచ్చరించడంతో  ఆ కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లా ధర్మవరం నుండి విజయవాడ వెళ్తున్న సమయంలో వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నందు రోడ్డు సమీపంలో ముఖ్యమంత్రి పోలీసులతో గిరిజన నేత  రాష్ట్ర నాయకులను అక్రమ అరెస్టు చేయించడం మరియు స్టేషన్ కి తీసుకెళ్లి నోటీసులు జారీ చేయించి ఉద్యమాలు అణచివేయాలని చూడటం చాలా  బాధాకరం అన్నారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తూ ఉద్యమిస్తున్న నాయకులపై మీకు చిత్త శుద్ధి వుంటే మీరు వెంటనే జీవో నం రద్దుచేయాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకులని గిరిజన జాబితాలో చేర్చే హక్కు మీకు ఎవరిచ్చారని  వెంటనే ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 52 ని మరియు ఏకసభ్య కమిషన్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్కడో మారుమూల ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి గిరిజన జాబితాలో ఏబిసిడి కులాలను కలిపే ప్రయత్నాలు వెంటనే మానుకోవాలని లేనిపక్షంలో గత హయాంలో చంద్రబాబు నాయుడుకి పట్టిన గతే ఇప్పుడు మీకు కూడా పడుతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా తక్షణం జీవో నెంబర్ 52ను మరియు ఏక సభ కమిషన్ ను రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో అసెంబ్లీ సైతం ఇంకెన్నెన్నో ముట్టడి కార్యక్రమాలు చేపడతామని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో జీవిఎస్ఎస్ నాయకులు ఉపేంద్ర, బాలాజీ, వంశీ, విష్ణు, చిన్న, వేణు, పవన్, బాబు, లోకేష్, నందు నాయక్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button