Ntr

గిరిజన దినసరి ఉద్యోగులకు వేతనాలు చెల్లించండి

  • గిరిజన దినసరి ఉద్యోగులకు వేతనాలు చెల్లించండి
  • వెట్టిచాకిరి చేయించుకొని జీతాలు ఇవ్వట్లేదు
  • దినసరి ఉద్యోగస్తులను ఔట్సోర్సింగ్ చేయాలి
  • విజయవాడలోని ఎస్టీ కమిషన్ కార్యాలయంలో ఎస్టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ కి జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ వినతి
  • వారం రోజుల్లోగా జీతాలు చెల్లించాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ను కోరిన ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్

విజయవాడ (పల్లెవేలుగు) 29 అక్టోబర్: జిల్లాలోని ఎన్నో ఏళ్లుగా ఆశ్రమ, వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ స్కూళ్లలో అర్థకలితో పనిచేస్తున్న దినసరి గిరిజన ఉద్యోగులకు ప్రభుత్వం ఇంతవరకు విత్తనాలు చెల్లించకపోవడం చాలా బాధాకరమని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ తెలిపారు. ఈ విషయంపై విజయవాడలోని ఎస్టీ కమిషన్ కార్యాలయానికి వెళ్లి ఎస్టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ ను కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న దునిసరి ఉద్యోగస్తులకు సక్రమంగా జీతాలు చెల్లించడమే కాకుండా కొన్ని జిల్లాల్లో ఔట్సోర్సింగ్ చేశారని, కేవలం కర్నూలు ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు రెండు సంవత్సరాలు గడిచిన వారికి ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. వాళ్లను వెట్టి చాకిరి చేయించుకుంటూ జీతాలు సక్రమంగా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఎస్టీ కమిషన్ కు వివరించారు. ప్రస్తుతం దినసరి ఉద్యోగుస్తుల పరిస్థితి అయోమయంగా మారిందని, వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని క్లుప్తంగా తెలిపారు. వీరిని గుర్తించి పెండింగ్ లో ఉన్న జీతాలు చెల్లించి ఔట్సోర్సింగ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలిపారు.

స్పందించిన ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్

గిరిజన ఉద్యోగుల సమస్యలపై వెంటనే గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. కర్నూల్ లో పనిచేస్తున్న ఉద్యోగస్తుల గురించి వివరించారు. పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే వారి ఖాతాలోకి జమ అయ్యేలా చూడాలని జాయింట్ డైరెక్టర్ మల్లికార్జున్రెడ్డిని కోరారు. వారు వెంటనే కమిషన్కు బదులిస్తూ వారం రోజుల్లోగా వాళ్లకు జీతాలు చెల్లిస్తామని, అతి త్వరలోనే ఔట్సోర్సింగ్ కలిపే విధంగా ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తుందని భరోసా ఇచ్చారు. స్పందించిన శంకర్ నాయక్ గారికి రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతోపాటు జిపిఎస్ యువజన నాయకులు విక్రమ్ నాయక్ పాల్గొన్నారు

hameedulla

Hameedulla.Shaik Reporter, Nandyal, Nandyal Dist
Back to top button