nandyala

గిరిజనులకు అన్యాయం జరిగితే సహించేది లేదు

  • గిరిజనులకు అన్యాయం జరిగితే సహించేది లేదు
  • గిరిజనుల గొంతు కోసే నిర్ణయాలు తీసుకోవద్దు
  • ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్

నంద్యాల (పల్లెవేలుగు) 03 నవంబర్: బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి గిరిజనుల గొంతు కోసే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవద్దని గిరిజనులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బోయ వాల్మీకి బెంతు ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేసేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ కన్నులు నగరంలోని సూరజ్ గ్రాండ్ హోటల్ లో గురువారం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. బంజారా ధర్మసేన రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం నాయక్ మరియు ఇతర సంఘాల నాయకులతో హాజరై భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ను, 52 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచిన గిరిజన బ్రతుకులు ఇంకా కుతికిన పడలేదన్నారు. వారి జీవన విధానంలో ప్రభుత్వాలు మార్పులు తేవలేదన్నారు. ఇంకా గూడాలలో, ఎరుకల కాలనీలో, తండాలలో ఎక్కడో కొండల్లో నివసిస్తూ మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో రాజ్యాంగ వృద్ధమైన నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం సరికాదన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ చొరవ చూపి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని కోరారు. లేదంటే భవిష్యత్తులో అన్ని గిరిజన సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసనగా రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజనుల గొంతు వినిపించేందుకు త్వరలోనే నంద్యాల జిల్లా సాక్షిగా భారీగా ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా ధర్మసేన రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం నాయక్, జిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, విక్రమ్ నాయక్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button