nandyala

గన్ని అబ్దుల్ కరీం ను ఘనం గా సన్మానించిన కార్వానే ఉర్డు నాయకులు

గన్ని అబ్దుల్ కరీం ను ఘనం గా సన్మానించిన కార్వానే ఉర్డు నాయకులు

నంద్యాల (పల్లెవేలుగు) 17 డిసెంబర్: వైసీపీ యువ నాయకుడు గన్ని కరీం ను ఉర్దూ సాహిత్త్య కమిటీ కార్వానే ఉర్దూ ఆధ్వర్యంలో మున్సిపల్ కో. ఆప్షన్ మెంబెర్ సలముల్లా అధ్యక్షతన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఫర్హీన్ భాను మాట్లాడుతూ తమ పాఠశాలకు తెలుగు భోధించడానికి తన సొంత నిధులతో ఒక విద్యావలేంటీర్ ని నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సలాముల్లా మాట్లాడుతూ ఉర్దూ భాష కొరకు ఘన్ని కరీం చేస్తున్న సేవలను కొనియాడారు. కార్వానే ఉర్దూ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మున్ముందు ఉర్దూ భాష కొరకు ఘన్ని కరీం సేవలు కొనసాగింస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సన్మాన గ్రహీత ఘన్ని కరీం మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ఉర్దూ భాష అభివృద్ధికి ఉర్దూ విద్యార్థుల విద్య భవిషత్ కు తన సహాయ సహకారాలు ఉంటాయాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ CRP నవాజ్ భాష, YCP లీడర్ హాబీబుల్లా, చంద్ బాషా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button