
panyam
గగ్గుటూర్ లో వైద్య శిబిరం
- గగ్గుటూర్ లో వైద్య శిబిరం
- శాంతిరాం సేవా సమితి ఆధ్వర్యంలో
- వైద్య శిబిరం నిర్వహించారు,
పాణ్యం (పల్లెవెలుగు) 15 గురువారం: మండలంలోని, గగ్గుటూర్ నందు శాంతిరాం సేవా సమితి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు, గ్రామ సర్పంచ్ పద్మావతమ్మ, హెల్పింగ్ సొసైటీ అధ్యక్షులు సద్దాల శేఖర్ రెడ్డి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు, గ్రామంలో ఆరోగ్యవంతులుగా ఉండాలని గ్రామంలో దాదాపు 125 మందికి బీపీ షుగర్ కు గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్సలు చేయించి మందులు ఇప్పించడం జరిగింది, అనంతరం గ్రామములో ఉన్నటువంటి పక్షవాతం సంబంధించిన రోగులకు ప్రత్యేకంగా చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సద్దల శ్రీనివాస్ రెడ్డి, మద్దూరు డాక్టర్లు సుబ్బారెడ్డి,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు