nandyala

ఖైదీల సంక్షేమ దినం సందర్భంగా సబ్ జైల్లో మినరల్ వాటర్ ఆర్వో ప్లాంట్

  • ఖైదీల సంక్షేమ దినం సందర్భంగా సబ్ జైల్లో మినరల్ వాటర్ ఆర్వో ప్లాంట్
  • – ప్రారంభించిన నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డ

నంద్యాల (పల్లెవేలుగు) 03 అక్టోబర్:  అక్టోబర్ 2 గాంధీ జయంతి ఖైదీల సంక్షేమ దినం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల సబ్ జైల్లో వాటర్ ఆర్వో ప్లాంట్, వీల్ చైర్, పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నంద్యాల డిఎస్పి మహేశ్వర్ రెడ్డి, సబ్ జైల్ సూపరింటెండెంట్ గురుప్రసాద్ రెడ్డిలు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా తరఫున సబ్ జైలు ఖైదీలకు మినీ ఆర్ఓ ప్లాంట్ ను సాఫ్ట్వేర్ ఉద్యోగి, రెడ్ క్రాస్ సభ్యుడు షాషావలి సహకారంతో, అలాగే ఖైదీల సౌలభ్యం కోసం వీల్ చైర్ ను సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఎండి, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మారుతికుమార్ సహకారంతో అందజేయడం జరిగింది. రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల, వైస్ చైర్మన్ మారుతికుమార్, సెక్రెటరీ మమతారెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు  ఉస్మాన్ భాష, యాకూబ్, మద్దిలేటి, మండల చైర్మన్ నాగేశ్వర్రెడ్డి, సభ్యులు నూర్ భాష, న్యాయవాదులు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ డిఎఫ్ఓ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ  ఖైదీలు తాము చేసిన నేరాల పట్ల పరివర్తన చెంది, మంచి మనుషులుగా జీవించాలని కోరారు. అహింసా, శాంతి, సత్యం అనే మహాత్మా గాంధీ సిద్ధాంతాలను పాటించాలని కోరారు. జైల్ ఆవరణంలో ముఖ్య అతిథులు చేతుల మీదుగా మొక్కలను నాటడం జరిగింది. ముఖ్య అతిధుల చేతుల మీదుగా దాతలను సన్మానించడం జరిగింది.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button