
ఖిద్మత్ సొసైటీ లో సభ్యత్వం నమోదు ప్రారంభించిన జమాఆతె ఇస్లామి అధ్యక్షులు అబ్దుల్ సమద్
ఖిద్మత్ సొసైటీ లో సభ్యత్వం నమోదు ప్రారంభించిన జమాఆతె ఇస్లామి అధ్యక్షులు అబ్దుల్ సమద్
నంద్యాల (పల్లెవెలుగు) 30 ఆగష్టు: నంద్యాలలో సెప్టెంబర్ రెండవవారం ప్రారంభమించబోతున్న ఖిద్మత్ మ్యూచవల్ ఐడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లో సభ్యత్వం తీసుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నంద్యాల జమాఆతె ఇస్లామి అధ్యక్షులు షేక్ అబ్దుల్ సమద్ లాంఛనంగా ప్రారంభించారు. మహిళల తరుపున మొహతరమా బేగం అమ్తుస్సలాం సభ్యత్వం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఖిద్మత్ సొసైటి అధ్యక్షులు నవాజ్ ఖాన్, సొసైటి మేనేజర్ ముహమ్మద్ ఫయాజ్, ముహమ్మద్ షఫీ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ సమద్ మాట్లాడుతూ కోఆపరేటివ్ చట్టం ప్రకారం ఆమోదితమైన ఖిద్మత్ సొసైటి నంద్యాలలో త్వరలో ప్రారంభం కాబోవటం స్వాగతించే అంశమని ముఖ్యంగా చిన్న వ్యాపారులు, పేదవారు ఋణాలు పొందుటకు, పొదుపుకు మంచి అవకాశముందన్నారు. ప్రతి సభ్యలు సొసైటి లో షేర్ హోల్డర్ గా వాటాదారులు అవుతారన్నారు. సొసైటి అధ్యక్షులు నవాజ్ ఖాన్ మాట్లాడుతూ సొసైటి లావాదేవిలన్ని ఆన్ లైన్ ద్వారా జరుగుతాయని సొసైటి ఫీల్డ్ అసిస్టెంట్లు సభ్యుల గడప వరకు వచ్చి సెవలందిస్తారు అన్నారు. ఫయాజ్ సొసైటి సభ్యత్వ అర్హతలు వివరించారు. సొసైటి కార్యాలయం ముల్లాన్ పట్టిలో ఉంది. కార్యక్రమంలో అకౌంటెంట్ నురూల్ హఖ్, ఫీల్డ్ అసిస్టెంట్లు బద్రుజ్జమా, ఫయాజ్ పాల్గొన్నారు. ముహమ్మద్ ఫయాజ్ సొసైటి మేనెజర్, 9908700343