nandyala

ఖిద్మత్ లో 200 మందిని చేర్పించిన సిబ్బందిని అభినందించిన మేనేజింగ్ కమిటీ

ఖిద్మత్ లో 200 మందిని చేర్పించిన సిబ్బందిని అభినందించిన మేనేజింగ్ కమిటీ

నంద్యాల (పల్లెవేలుగు) 06 అక్టోబర్: సెప్టెంబర్ 14 న ప్రారంభమైన ఖిద్మత్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో మాసంలోనే 200 పై బడి సభ్యులును చేర్చి దక్షిణ భారతదేశంలోని సొసైటీల్లో ద్వితియా స్థానంలో రావటానికి శ్రమించిన సిబ్బందిని నంద్యాల బ్రాంచి మేనెజింగ్ కమిటి అభినందించింది. కమిటి అధ్యక్షుడు నవాజ్ ఖాన్ అధ్యక్షుతన నిర్వహించిన సమావేశంలో కార్యదర్శి అబ్దుల్లా, సభ్యులు సియం జకరియా, నశ్యం ముహమ్మద్ ఆసీఫ్, జిల్లా డైరెక్టర్లు అబ్దుల్ సమద్, పీవి ముస్తఫా, హాఫీజ్ ముహమ్మద్ షోయబ్ జమాన్ హాజరై సొసైటీ పనితీరు సమీక్షించారు. వివిధ కూడలీలలో టెంటువేసి ప్రజలకు ఖిద్మత్ సేవలు పరిచయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అబ్దుల్ సమద్ సిబ్బంది సేవలు ప్రశంసిస్తూ నిరంతరం శ్రమిస్తున్న మేనేజర్ ముహమ్మద్ ఫయాజ్, అకౌంటెంట్ నూరుల్ హఖ్, ఫీల్డ్ అసిస్టెంట్లు బద్రుజ్జమా, ఫయాజ్ ను అభినందించారు. ఈ సేవలు ఇలాగె కొనసాగిస్తే మంచి ఇన్సెంటివ్ ఉంటుందన్నారు. ఇది వడ్డీ రహిత బ్యాంకు, ప్రజలు గడప వరకు వచ్చి సేవలు అందిస్తుంది కాబట్టి ఖిద్మత్ సేవలు ప్రజలు ముఖ్యంగా పేదలు వినియోగించుకోవాలని కోరారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button