Dharmavaram

క్రీడలు శరీర దృఢత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతాయి.. మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల

క్రీడలు శరీర దృఢత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతాయి.. మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల

ధర్మవరం (పల్లెవెలుగు) 09 నవంబర్: క్రీడలు శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం, ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయని మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం  స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న క్రీడా సంబరాల నియోజకవర్గస్థాయి ఎంపిక కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ క్రీడా సంబరాల్లో నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల కబడి, వాలీబాల్, క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు. తొలుత క్రీడాకారులను చైర్మన్ లింగం నిర్మల తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ పెను జూరు నాగరాజు, మాజీ కౌన్సిలర్ ధర్మాంబా అసోసియేషన్ సహకార దర్శి ఉడుముల రామచంద్ర, వైఎస్సార్సీపీ నాయకుడు కేశవరెడ్డి , సభ అధ్యక్షులు, పాఠశాల హెచ్ఎం శైలజ లు క్రీడాకారులతో పరిచయ కార్యక్రమాన్ని, క్రీడా వందనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అందరూ కూడా కొద్దిసేపు క్రికెట్ ఆడి ఉల్లాసాన్ని కలిగించారు. కబడ్డీలో పురుషులు,స్త్రీలు గా రెండు టీములు, వాలీబాల్ ఒక టీము, క్రికెట్ లో ఒకటిము ఎంపిక చేయడం జరిగింది. అనంతరం మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల మాట్లాడుతూ ఏ ప్రభుత్వము కూడా విద్య క్రీడల్లో సరియైన ప్రాధాన్యత ఇవ్వలేదని, నేడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడం, క్రీడాకారులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. క్రీడలతో పాటు చదువులో కూడా మంచి ప్రతిభను కనపరిచినప్పుడే, భవిష్యత్తు బంగారు బాటలో ఉంటుందని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన వారు త్వరలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏడు నియోజకవర్గాల వారి నుండి ఎంపికైన వారికి పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ నవీన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు నాగేంద్ర, రఘునాథరావు, హరి ప్రసాద్, వేణుగోపాల్, లక్ష్మీనారాయణ, హాకీ కోచ్ హసేన్ తదితరులు పాల్గొన్నారు.

chiranjeevi

Chiranjeevi Reporter,Dharmavaram, Satyasai District
Back to top button