
కోసిగి లో రెండవ రోజు గడప గడపకు కార్యక్రమంలో అడగడుగునా నీరాజనాలు.
- కోసిగి లో రెండవ రోజు గడప గడపకు కార్యక్రమంలో అడగడుగునా నీరాజనాలు.
- సమస్యల పరిష్కారానికి మీ గడప ముందుకు రావడం
కోసిగి (పల్లెవేలుగు) 22 నవంబర్: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అమలు తీరును, ప్రత్యక్షంగా ప్రతి గడపకు వెళ్లి సమస్యలను తెలుసుకునేందుకు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వైయస్సార్సీపి కర్నూలు జిల్లా అధ్యక్షులు బాల నాగిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కోసిగి రెండవ సచివాలయ పరిధిలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కుమారి అయ్యమ్మ అధ్యక్షతన మండల ఇంచార్జ్ మురళీమోహన్ రెడ్డి సహకారంతో గడపగడపకు కార్యక్రమంలో మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగి రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలోని ప్రతి గడపలో సీఎం జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన కుటుంబం ముఖంలో చిరునవ్వు చూడడం జరిగిందని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. కోసిగిలోని శాశ్వత త్రాగు నీరు కోసం 2వ, 3వ, 4వ, 5వ మరియు 6వ వార్డులకు త్రాగునీరు అందించేందుకు దాదాపు సుమారు 12 లక్షల రూపాయలతో లక్ష లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన సంపును ప్రారంభించారు. సర్పంచ్ కుమారి అయ్యమ్మ, ఎంపీపీ ఈరన్న గజమాలతో ఎమ్మెల్యే ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, ఏపీఎం సత్యమ్మ, ఏపీడబ్ల్యు మల్లికార్జున రెడ్డి, హౌసింగ్ సోమప్ప, వైస్ సర్పంచ్ వాణి, కో-ఆప్షన్ మెంబర్ షోకత్, మండల కన్వీనర్ బెట్టన్న గౌడ్, సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు, జగదీష్ స్వామి, మాణిక్య రాజు, మంగమ్మ , హోలగుంద కోసిగయ్య, వక్రాణి వెంకటేశులు, కాంట్రాక్టర్ బసి రెడ్డి, దొడ్డి నరసన్న, పి నాగేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది మరియు, వాలంటరీలు పాల్గొన్నారు.