kosigi

కోసిగి దాహార్తిని తీర్చేందుకు శాశ్వత పరిష్కారం

  • కోసిగి దాహార్తిని తీర్చేందుకు శాశ్వత పరిష్కారం
  • 2019 ఎన్నికల హామీలో భాగంగా నేరవేర్చిచిన వైనం
  • ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రత్యేక చోరవతోనే సాధ్యం
  • పనులను పరిశీలించిన వైఎస్సార్సీపీ మండల ఇంచార్జీ మురళీ మోహన్ రెడ్డి

 

కోసిగి (పల్లెవేలుగు) 29 నవంబర్: మేజర్ గ్రామ పంచాయతీ మరియు మండల కేంద్రము కోసిగిలో దాహార్తిని తీర్చేందుకు శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టడం జరుగుతుందని మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మంగళవారం కోసిగి లోని బూగేని చెరువులో చేపట్టనున్న పనులను అధికారులతో కలిసి మండల ఇంచార్జీ మురళీ రెడ్డి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి మండల కేంద్రము కోసిగిలో త్రాగునీటి ఎద్దడికి నివారణకు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని సర్వే నంబర్ 196/ఏ నందు దాదాపు 15.96 ఎకరాల విస్తీర్ణం గల బూగేని చెరువు ద్వారా త్రాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోంత నిధులు దాదాపు 30 లక్షలతో ముళ్ళకంప తొలగింపు మరియు గ్రౌండింగ్ వగైరా పనులను చేపట్టడం జరుగుతుందని ఈ పనుల అనంతరం దాదాపు 5కోట్లతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి స్వచ్చమైన త్రాగునీరు కోసిగి వాసులకు అందివ్వడం జరుగుతుందని మురళీ రెడ్డి తెలిపారు. 2019 ఎన్నికల హామీలో భాగంగా కోసిగికి త్రాగునీరు అందించేందుకు ఇచ్చిన మాటను ఈరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకులు ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి, యువనేత ధరణీరెడ్డి నేరవేర్చుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. అనంతరం మండల సర్వేయర్ బసవరాజు స్వామి,ఇరిగేషన్ అధికారులు చెన్నయ్య, వెంకటేశ్వర్లుతో కలిసి పనులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. పనులను వెంటనే ప్రారంభించాలని మార్చి నెలలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యంపీపీ ఈరన్న,మండల నాయకులు ఐరనగల్లు శ్రీనివాస రెడ్డి, నాడిగేని నాగరాజు,కాంట్రాక్ట్ బసిరెడ్డి,దొడ్డి నర్సన్న, వందగల్లు లక్ష్మయ్య, ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం బోర్డు సభ్యులు బుళ్ళి నరసింహులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Mohammad Yousuf

Mohammad Yousuf Reporter, Kosigi, Kurnool DIst
Back to top button