
kosigi
కుక్కల దాడిలో ముప్పై పొట్టేళ్ళు మృతి
కుక్కల దాడిలో ముప్పై పొట్టేళ్ళు మృతి
కోసిగి (పల్లెవేలుగు) 10 అక్టోబర్: మండల పరిధిలోని సజ్జల గూడెం గ్రామ పంచాయితీ లోని దేవరబెట్ట గ్రామంలో ఉన్న సజ్జల.వీరేష్ అనే రైతు పొలంలో సోమవారం కుక్కల దాడిలో రైతు పెంచుకుంటున్న 30 పొట్టేలు పిల్లలు మృతి చెందడం జరిగింది. స్థానికులు,గ్రామస్తులు,రైతు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి రైతు తన కుటుంబ సభ్యులతో పత్తి పంటలో పనులు చేసుకుని , ఇంటికి వెళ్లడం జరిగిందని రాత్రి సమయంలో గ్రామంలోని కుక్కలు ఒక్కసారిగా మంద పై పడి 30 పొట్టేలు పిల్లలను చంపడంతో రైతు కన్నీరు మున్నీరైయ్యాడు. దాదాపు లక్షా 50 వేల రూపాయలు నష్టం జరిగిందని రైతు తెలిపాడు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతును ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.