Dhone

కిడ్నీ భాదితురాలికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ

కిడ్నీ భాదితురాలికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ

డోన్ (పల్లేవెలుగు) 03 అక్టోబర్ :  డోన్ టౌన్ కొండపేటలో నివాసం ఉంటున్న 23 సంవత్సరాల మంజుల అనే మహిళకు రెండు కిడ్నీలు విఫలమయ్యాయి. కాగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆమె భర్త గోవర్ధన్ స్థానికంగా ఉన్న చేయూత స్వచ్ఛంద సేవా సంస్థను ఆర్థిక సహాయం నిమిత్తం ఆశ్రయించారు. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వారు దాతల సహకారం కోరుతూ పలు సోషల్ మీడియాలలో షేర్ చేసి ఒక లక్ష రూపాయలు సేకరించి బాధిత కుటుంబానికి అందజేశారు. తన పరిస్తితిని అర్థం చేసుకొని ఆర్థిక సహాయం చేసిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వారికి బాధితురాలు కృతజ్ఞతలు తెలిపారు. చేయూత ట్రస్ట్ కోశాధికారి మీసేవ శీను మాట్లాడుతూ మంజుల కష్టాన్ని తీర్చడానికి ధాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎదుటివారి సాయం కోసం ముందుకు వచ్చే వారిని కలుపుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని తెలియజేశారు. గాంధీ మహాత్ముని జయంతి రోజున ఈ సహాయ కార్యక్రమం చెయ్యడం తమ ట్రస్టు అదృష్టంగా భావిస్తున్నామన్నారు.కార్యక్రమంలో ధాతలు గోల్డ్ షాప్ మనోహర్, డోన్ వైన్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, చేయూత ట్రస్ట్ అధ్యక్షుడు వెంకటేష్, జనరల్ సెక్రెటరీ రవికుమార్, జాయింట్ సెక్రెటరీ టైలర్ బాష,ట్రస్టు సభ్యులు గోల్డ్ షాప్ రాజశేఖర్ ఆచారి, చంద్ర శేఖర్ గౌడ్, దేవరాజు, జయన్న, మోహన్, రామాంజనేయులు, నూర్ బాష, గుర్రం మధు, గోల్డ్ హరి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

naveen kumar

Naveen Kumar Reporter, Dhone Nandyal Dist.
Back to top button