
కార్యకర్తలకు అండగా నిలిచిన రాంపురం రెడ్డి సోదరులు.
కార్యకర్తలకు అండగా నిలిచిన రాంపురం రెడ్డి సోదరులు.
వ్యాధిగ్రస్తునికి మరియు మరణించిన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి,యువ నేత ధరణీ రెడ్డి,మండల ఇంచార్జీ మురళీమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు పరమార్శ
రాంపురం రెడ్డి సోదరుల కుటుంబం కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని కోసిగి యంపీపీ ఈరన్న,మండల నాయకులు నాడిగేని నాగరాజు,జగదీష్ స్వామి అన్నారు.శనివారం మండల కేంద్రము కోసిగిలోని 3వ వార్డుకు చెందిన సంజీవ గేని చిన్న కోసిగయ్య గత కొన్ని రోజులుగా డయాలసిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మండల ఇంచార్జీ మురళీ రెడ్డి ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి తక్షణ సహాయం కింద 15వేల రూపాయలు బాధితుని భార్య కు అందజేశారు.
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
యన్టీఆర్ కాలనీ నందు అనారోగ్యంతో మరణించిన బుడగజంగాల మల్లమ్మ (47) కుటుంబానికి తక్షణ సహాయం 5వేల రూపాయలు,వైయస్సార్ భీమా పథకం కింద సమగ్ర వివరాలు సేకరించి,ఆర్థిక సహాయం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని యంపీపీ ఈరన్న,యన్ నాగరాజు,జగదీష్ స్వామి సచివాలయ సిబ్బందికి ఆదేశించారు.ఈసందర్బంగా చిన్న కోసిగయ్య,బుడగ జంగాల మల్లమ్మ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి,మండల ఇంచార్జీ మురళీ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో నాయకులు గానిగి వీరాస్వామి,కోరివి నాగరాజు, బుళ్ళినర్సింహులు,వెంకటేష్ బుడగజంగాల అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.