YSR KADAPA

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కె.సుబ్రహ్మణ్యం శర్మ నియామకం.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కె.సుబ్రహ్మణ్యం శర్మ నియామకం.

వైయస్సార్ కడప జిల్లా (పల్లె వెలుగు) సెప్టెంబర్ 23 :  కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జమ్మలమడుగు నియోజవర్గం ఎర్రగుంట్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం శర్మాను నియమిస్తున్నట్లు శుక్రవారం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆదేశాల మేరకు సుబ్రహ్మణ్యం శర్మనియామకం జరిగినట్లు తెలిపారు సుబ్రహ్మణ్యం శర్మ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. తనను గుర్తించి ఈ పదవి అప్పగించినందుకు పార్టీ కోసం సాయశక్తుల కృషి చేస్తానని తనకు ఈ పదవి రావడానికి సహకరించిన తులసి రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Nasib Basha

Nasib Basha, yerraguntla, Reporter, YSR Kadapa Dist,
Back to top button