
కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శిగా కే జిలాని బాధ్యతలు స్వీకరించారు
కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శిగా కే జిలాని బాధ్యతలు స్వీకరించారు
కోసిగి (పల్లెవెలుగూ౦) 23 సెప్టెంబర్: మండలం కోసిగి విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కే జిలాని మాట్లాడుతూ విజయవాడలో బుధవారం జాతీయ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా నాకు నియమించిన, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కి ఏపీ సి సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ కి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చైర్మెన్ దాదా గాంధీ కి మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జ్ కె బాబు రావు కి హృదయపూర్వకముగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాపై నమ్మకముతో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు కానీ నేను బతికి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకు రాకుండా కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కాపాడుతూ నా దృష్టికి వచ్చిన పేద ప్రజల సమస్యలు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకో పోయి ప్రభుత్వ అధికారులు ప్రజాసమస్యలు పరిష్కరించలా సిందే అని కోరుతూ పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు పేద ప్రజల పక్కన, నేను ఉంటూ ప్రజల నుంచి ఎటువంటి అక్రమాలకు అలవాటుపడి బహుమానం తీసుకోనని, నేను నీతి నిజాయితీగా ధర్మముగా ప్రజాసమస్యలు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసు కో పోయి పేద ప్రజల సమస్యలకు న్యాయం జరిగే వరకు ప్రజలకు అండగా సదా సేవకుడిగా పోరాటం చేస్తూ ఉంటానని జాతీయ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలాని పేర్కొన్నారు