nandyala

కర్నూల్ లో న్యాయ రాజధాని ఏర్పాటు కు పూర్తి మద్దతు : ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక

కర్నూల్ లో న్యాయ రాజధాని ఏర్పాటు కు పూర్తి మద్దతు : ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక

నంద్యాల పట్టణంలోని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కార్యాలయంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు ఆకుమళ్ళ రహీమ్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం ఐక్యవేదిక సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు ఆకుమళ్ళ రహీమ్ మాట్లాడుతూ… రేపు 5న కర్నూల్ పట్టణంలో జరుగుతున్న రాయలసీమ గర్జనకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు, శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు కావాలని, పాలన వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయని, న్యాయ రాజధానితో, 9 జాతీయ రహదారులతో అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెరుగుతుందన్నారు. 10, 500 ఎకరాల్లో దేశంలోనే ఎనిమిదో అతిపెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చి, నిరుద్యోగిత సమసిపోతుంది. సీమకు రాజధాని రావాలంటే ప్రతి ఒక్కరి మద్దతు అవసరం. కర్నూల్లో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమములో ఐక్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలీ, జిల్లా కోశాధికారి సత్యనారాయణ గుప్తా, నంద్యాల పట్టణ అద్యక్షులు గులాం హుస్సేన్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి శివ శంకర్,పట్టణ కోశాధికారి సయ్యద్ మౌలాలి,ఉపాధ్యక్షులు నబిరసోల్, చెన్నా రెడ్డి ,సంజీవ రాజు,పట్టణ కార్యదర్శులు జమాల్ బాషా,ఉస్మాన్ ,మరియు బండి ఆత్మకూరు మండలం సభ్యులు నాగ కాంత్ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button