
కనీస సౌకర్యాలు కల్పించాలని జగనన్న కాలనీ వాసులు డిమాండ్
కనీస సౌకర్యాలు కల్పించాలని జగనన్న కాలనీ వాసులు డిమాండ్
- జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జగనన్న కాలనీ లను తనిఖీ చేసిన పాణ్యం తహశీల్దార్, మండల అభివృద్ధి అధికారి
పాణ్యం (పల్లెవెలుగు) 11 జనవరి: మండలంలోని కౌలురు గ్రామాన్ని తాసిల్దార్ మల్లికార్జున్రెడ్డి మండల అభివృద్ధి అధికారి దస్తగిరి జగనన్న కాలనీ విజిట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలతో వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఉగాది నాటికి కేటాయించిన ఇంటి నిర్మాణాలు త్వరగా కట్టుకోవాలి. జిల్లా సర్వోన్నత అధికారి మునిజార్ జిలాని సామున్ ఆదేశించడం జరిగినది, కావున త్వరగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. గ్రామ ప్రజలు అధికారులతో వారు మాట్లాడుతూ జగనన్న కాలనీ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొన్ని ఇండ్లు స్థలాలు నిర్మాణం పూర్తి అయిన కనీస మౌలిక సదుపాయాలు,లేవని పాములతో, తెల్లతో, ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుంది అని డ్రైనేజి, కరెంట్, రోడ్లు లేవని రాత్రి సమయంలో చాలా ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుంది. అని కాలనీ వాసులు అధికారులకు వివరించడం జరిగింది. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, మధు, బాబర్, చాకలి శ్రీనివాస్, వెంకట చారి, ఖాదర్ బాషా, బాల మద్దిలేటి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు,