
Allagadda
కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య
ఆళ్లగడ్డ (ఆంధ్రప్రతిభ) 21 సెప్టెంబర్: పట్టణంలోని మేదర కాలనీకి చెందిన వివాహిత కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఆళ్లగడ్డ పట్టణ సీఐ జీవన్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాహిత కళ్యాణికి గత మూడు సంవత్సరాల నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోందని ఎన్నిసార్లు వైద్య పరీక్షలు చేయించిన నొప్పి తగ్గక పోవడంతో కడుపునొప్పిని తాళలేక ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియజేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జీవన్ బాబు అన్నారు.