
కంటి పట్ల ప్రేమను పెంచుకున్నప్పుడే, కన్ను పదిలంగా ఉంటుంది కంటి వైద్య నిపుణులు
కంటి పట్ల ప్రేమను పెంచుకున్నప్పుడే, కన్ను పదిలంగా ఉంటుంది కంటి వైద్య నిపుణులు
ధర్మవరం (పల్లె వెలుగు) అక్టోబర్ 13: కంటి పట్ల ప్రేమను పెంచుకున్నప్పుడు, ఆ కంటిపైన తగిన జాగ్రత్తలను తీసుకున్నప్పుడే కన్ను పదిలంగా ఉంటుందని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ పురపాలక బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన “ప్రపంచ దృష్టి దినోత్సవ కార్యక్రమానికి “వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. తదనంతరం కంటిలో వచ్చే పలు సమస్యలకు, నివారణ మార్గాలను కూడా విద్యార్థులకు అవగాహన చేశారు. తదుపరి వారు మాట్లాడుతూ దృశ్య మాధ్యమాలను దుర్వినియోగం చేయకూడదని, అనగా టీవీల యందు, సెల్ఫోన్లో యందు ఎక్కువ సమయం కేటాయించితే కంటి సమస్యలతో పాటు దృష్టిలోపము ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఏ విటమిన్ లభించే ఆహార పదార్థాలను అధికంగా సేవించాలని, బొప్పాయి, క్యారెట్, ఆకుకూరల వంటివి భుజించాలన్నారు. అంతేకాకుండా సీజన్లో వచ్చే పండ్లను కూడా అధికంగా తింటే ,దృష్టి బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. చదువుకునే చిన్న వయసులోనే కల్లపట్ట తగిన జాగ్రత్తలను తల్లిదండ్రులు కూడా తెలియ చెప్పాలని, అంటే ఆ వయసులో ఆ పిల్లలకు సెల్ఫోన్లు టీవీలను సాధ్యమైనంతవరకు దూరంగా పెట్టాలని తెలిపారు. లేనియెడల దృష్టిలోపంతో పాటు, పలు సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ కళ్ళను తమరే ప్రేమించుకుని, ఆ కంటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా చదువుకునే వయసులో తరగతి గదులలో దగ్గర చూపు, దూరము చూపు లాంటివి అవుపిస్తాయని, అంతేకాకుండా తరగతి గదిలో బోర్డ్ కనపడలేని సంఘటనలు కూడా ఉంటాయని, అటువంటి అప్పుడు ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క కంటి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధను ఉంచి, ప్రభుత్వ ఆసుపత్రులలో కంటి వైద్య చికిత్సలను చేయించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు, వ్యాయామం కూడా ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివానగర్ అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ సరిత, ఎన్జీవో సంఘం అధ్యక్షులు డాక్టర్ ఉరుకుందప్ప, పాఠశాల హెచ్ఎం రాంప్రసాద్, సైన్స్ ఉపాధ్యాయురాలు రాజేశ్వరి, ప్రకాష్, ఆశ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.