Dhone

ఓబిసి మోర్చా అధ్యక్షునిగా హరినాయుడు ఎన్నిక

డోన్ ఓబిసి మోర్చా అధ్యక్షునిగా హరినాయుడు ఎన్నిక

డోన్ (పల్లెవెలుగు) 22  నవంబర్: బిజెపి ఓబీసీ మోర్చా డోన్ పట్టణ అధ్యక్షుదిగా హరి నాయుడును నియమించడం జరిగింది. నంద్యాల జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి మరియు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివకృష్ణ యాదవ్, మరియు ఓబీసీమోర్చా, జిల్లా ఉపాధ్యక్షులు, బోయ బాలకృష్ణ, ఆధ్వర్యంలో నియమించడం జరిగింది. మరియు బిజెపి ఓబిసి మోర్చా, బేతంచెర్ల మండల అధ్యక్షుడుగా చెరకుచెర్ల. శ్రీనివాసులుని ఎన్నుకోవడం జరిగినది. ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శిగా అశోక్ కుమార్ ని ఎన్నుకోవడం జరిగింది. మరియు ఓబిసి మోర్చా జిల్లా కార్యదర్శిగా శారదా కుమారిని, ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఓబీసీమోర్చా, జిల్లా కార్యవర్గ సభ్యునిగా  పవంగి ఉమాజి రావు ని ఎన్నుకోవడం జరిగినది. ఈ సందర్బంగా అశోక్ కుమార్, శారదా కుమారి, ఉమాజి రావు, బీ.హరి నాయుడు, శ్రీనివాలుసులు మాట్లాడుతు బిజెపి నాయకులు మమ్ములను గుర్తించి బిజెపి ఓబిసిమోర్చా బాధ్యతలు అప్పగించి నందుకు వారికీ ధన్యవాదములు. అలాగే బిజెపి ని బలోపేతం చేసేటందుకు ఓబిసి లను పార్టీకి దగ్గర చేయడమే లక్ష్యంగా పని చేస్తామని వారు అన్నారు. ఎన్నిక పట్ల వారి సన్నిహితులు శ్రీను, విజయ్, మనోహర్, రామంజి, మద్దిలేటి, ప్రసాద్, సాయి, విక్రమ్, తదితరులు హార్షం వ్యక్తం చేశారు.

naveen kumar

Naveen Kumar Reporter, Dhone Nandyal Dist.
Back to top button