nandyala

ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవ ఎన్నిక.

ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవ ఎన్నిక.

బీసీలను అందరిని కలుపుకొని బీసీ హక్కుల కోసం నిరంతరం  పోరాటం చేస్తాం – నందవరం శ్రీనివాసులు.

 

నంద్యాల (పల్లెవెలుగు) 08 సెప్టెంబర్: ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గా నందవరం శ్రీనివాసులు ను, రాష్ట్ర అధ్యక్షుడు మాపటి రవికుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసారు. ఈ నెల 6వ తేదీన నంద్యాల పట్టణంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  బీసీ రాష్ట్ర కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు  మాపటి రవికుమార్ యాదవ్  రాష్ట్ర కార్యదర్శిగా నందవరం శ్రీనివాసులు ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు ఉత్తర్వులు అందజేసారు.ఈ సందర్బంగా  నందవరం శ్రీనివాసులు  నూతనంగా ఎన్నికైనందుకు బుధవారం నాడు మీడియా సమావేశాన్ని స్థానిక తెలుగుగంగ గెస్ట్ హౌస్ నందు నిర్వహించారు.ఈ సందర్బంగా యన్.శ్రీనివాసులు మాట్లాడుతూ నన్ను  ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు.  గతంలో జిల్లా గౌరవాధ్యక్షుడు గా పని చేశానని, బీసీల అభివృద్ది కోసమే నేను ఈ సంఘంలో చేరడం జరిగిందని తెలిపారు.ఈనెల 6న జరిగిన రాష్ట్ర కమిటీ సమీక్షా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు  రవికుమార్ యాదవ్ నా మీద ఎంతో నమ్మకంతో రాష్ట్ర కార్య దర్శిగా ఎన్నిక చేయడం తో నా పై మరింత బాధ్యత పెరిందని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, బీసీ సంక్షేమ సంఘం అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ  ఇచ్చారు.నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాలలో నియోజక వర్గ కమిటీలు వేయడంతో పాటు బీసీలను అందరినీ కలుపుకొని, బీసీ హక్కుల కోసం,బీసీ రిజర్వేషన్ల కోసం  పోరాటం చేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు టి. ప్రతాప్, టిజి. శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు,రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.వి రమణ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

Nazar Javid

Nazar Javid Editor & Chairman, Nandyal
Back to top button