
ఏపీయూడబ్ల్యూజే కోసిగి మండల కమిటీ ఎన్నిక
ఏపీయూడబ్ల్యూజే కోసిగి మండల కమిటీ ఎన్నిక
కోసిగి (పల్లెవెలుగు) 15 నవంబర్: ఏపీయూడబ్ల్యూజే కోసిగి మండల కమిటీ ఎన్నికను సోమవారం స్థానిక శ్రీ శక్తి భవనం నందు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర,జిల్లా కమిటీ ఆదేశాల మేరకు జిల్లా ఉపాధ్యక్షులు చాంద్ బాషా, జిల్లా సహాయ కార్యదర్శి హనుమేష్ , సీనియర్ జర్నలిస్టులు జయరాజు, సురేష్ , శేఖర్ , శ్రీరాములు ఆధ్వర్యంలో చేపట్టారు. ఏపీయూడబ్ల్యూజే మండల అధ్యక్షుడిగా షబ్బీర్ (విశాలాంధ్ర), గౌరవ అధ్యక్షులుగా గడ్డం.ఈరన్న, ఉపాధ్యక్షులుగా కర్రెప్ప, నరసింహులు, ప్రధాన కార్యదర్శి ప్రదీప్, సహాయ కార్యదర్శులుగా ప్రవీణ్, ప్రభాకర్, కోశాధికారి నాగరాజు మరియు కార్యవర్గ సభ్యులు శ్రీరాములు, రాజేష్ వీరితోపాటు మరో 12 మందిని సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండలంలో ఉన్న విలేకరులకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరు ఏపీయూడబ్ల్యూజే మండల కార్యాలయం కోసిగి మండలానికి సంబంధించి సంక్షేమనేది వంటి సమస్యలను ఎజెండాగా పెట్టారు. రాబోయే రోజుల్లో విద్య,వైద్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన జర్నలిస్టులకు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు కలిసికట్టుగా ముందుకెళ్లి యూనియన్ సలహాలు, సూచనలతో మండల కమిటీ అందరి మన్ననలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విలేకరులు యూసుఫ్, సతీష్, రఘు, బాబు, మహమ్మద్, నాగరాజు, మధు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు